నేస్తమా,
రంగు రంగుల చొక్కాల్ని వేసుకున్నంత మాత్రాన
పుట్టుకతో
వచ్చిన వంటి రంగూ మారలేదు.
దూర దూర తీరాలు వెళ్ళినంత మాత్రాన
సొంత
వారు దూర మవ్వనూలేదు.
కొత్త కొత్త మిత్రుల్ని కలుస్తున్నంత మాత్రాన
మొట్టమొదటి
మిత్రుల్ని మర్చిపోనూలేదు.
చాన్నాళ్ళుగా మాట్లాడనంత మాత్రాన
మదిలోంచి
జ్ఞాపకాల గుర్తులు తగ్గనూ లేదు.
మన మాటలూ, ఆటలూ, నవ్వులూ, కోపాలూ, భయాలూ, భాధాలూ
అన్నీ గుర్తున్నాయి.
ఇవన్నీ బయట పెట్టకుండా, భద్రంగా బీరువాలో
దాచుకున్నానంతే.
ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ బయటకు
తీయవచ్చనీ,
జీవితాంతం భద్రంగా కాపాడుకుంటూ మురిపెంగా
చూసుకుందామనీ!