వరాల వ్రతం
తలచినంతనే మదిలో బంగారం తలపులు నింపుతావు
అత్తకోడల్లను ఒక్కచోట ప్రక్కప్రక్కనే ఆనందంగా కూర్చుండబెడతావు
ఐదుగురికి వాయనాలిచ్చి పది కాలాలు కలిసి ఉండేలా చేస్తావు
ఇరుగుపొరుగుకు, ఇంటిల్లిపాదికి ఇష్టంతో పుష్టిగా భోజనం పెట్టిస్తావు
కలిసివుంటే కలదు సుఖం అని కళ్ళకు కట్టినట్లుగా చూపెడతావు.
సంవత్సరానికి ఒక్కరోజు, ఒక్కసారి భర్త కళ్ళల్లో గర్వం నింపుతావు
ఆ ఒక్క దండానికి ప్రతిగా వారిని వారి భార్యలకు దాసోహం చేస్తావు
ఇన్ని వరాలిచ్చిన నిన్ను ఇంకేమనాలి తల్లీ? వరలక్ష్మి కాక!
అమ్మలకి, అమ్మాయిలకు, అందరికీ వరలక్ష్మి వ్రతం
శుభాకాంక్షలు.
ప్రొద్దున్నే వరలక్ష్మి వ్రతం అని ప్రసాదం తెచ్చి
ఇచ్చిన రజనికాంత్, రీనా దంపతులకు కృతజ్ఞతలతో!
No comments:
Post a Comment