Sunday, February 22, 2015

ఉషాదం


ఉషాదం
అమాయకమైన ఆత్మీయత
అందరికీ ఆరబోసిన ఓ అదునాతన ఆరిందా,
వెళ్ళిపోయావా అనంత దూరాలకు
అందరూ ఆదమరిచి వున్నప్పుడు
ఎక్కడ వెతకమంటావు ఉషా
నీ అమాయకపు నవ్వులు 
ఎవరికీ చెప్పమంటావు తల్లీ
మన అందరి మధుర జ్ఞాపకాలు
కరుణించని దేవుడికా? 
జీవిత చక్రం వడి వడిగా తిప్పిన ఆ పై వాడికా?
మంచి స్నేహం మరీ కరువైన ఈ రోజుల్లో
నాలుగు పదులకే నిన్ను మాకు దూరం చెయ్యాలా?
జాగ్రత్త తల్లీ నీ ప్రయాణంలో.
ప్రతి ఉషోదయంలో వస్తూ వుండు,
జగన్నాదుడుని ఒక కంట కనిపెడుతూ వుండు,
రోహితుడికి దారి చూపుతూ వుండు,
మా అందరి మదిలో చిరంజీవిగా వుండు.