ఉషాదం
అమాయకమైన ఆత్మీయతవెళ్ళిపోయావా అనంత దూరాలకు
అందరూ ఆదమరిచి వున్నప్పుడు
ఎక్కడ వెతకమంటావు ఉషా
నీ అమాయకపు నవ్వులు
ఎవరికీ చెప్పమంటావు తల్లీ
మన అందరి మధుర జ్ఞాపకాలు
కరుణించని దేవుడికా?
జీవిత చక్రం వడి వడిగా తిప్పిన ఆ పై వాడికా?
మంచి స్నేహం మరీ కరువైన ఈ రోజుల్లో
నాలుగు పదులకే నిన్ను మాకు దూరం చెయ్యాలా?
జాగ్రత్త తల్లీ నీ ప్రయాణంలో.
ప్రతి ఉషోదయంలో వస్తూ వుండు,
జగన్నాదుడుని ఒక కంట కనిపెడుతూ వుండు,
రోహితుడికి దారి చూపుతూ వుండు,
మా అందరి మదిలో చిరంజీవిగా వుండు.
No comments:
Post a Comment