Monday, March 19, 2018

పరిగెత్తు - వెనక్కు!

చిత్రం ఈ జీవితం
బయటంతా  ఉరుకులు, పరుగులు, అరుపుల హోరులు
కానీ తనలోకి చూసుకుంటే అర్ధరాత్రి నిశ్శబ్దం
దగ్గిరవున్నట్లనిపిస్తున్న గమ్యం
కానీ మరీ దూరమవుతున్న సంతోషం
గెలుస్తున్నట్లు అనిపిస్తున్న ఈ దిన దిన రణం
కానీ ఎక్కడ కనిపించని విజయోత్సాహం

ఆగు! ఒక్కసారి వెనక్కు పరిగెత్తు!
బంధువులకు  తగులుకుంటూ, తెలిసిన వాళ్ళను రాసుకుంటూ
అందరి ముఖాలలో మన ప్రతిబింబాన్నీ ,
అందరి కళ్ళల్లో మన మీద ప్రేమనీ చూసుకుంటూ
అప్పుడనిపిస్తుంది
అరే! ఈ నవ్వులు నన్ను ఆనందంగా, సంతోషంగా మార్చేస్తున్నాయే అని,
అరే! దూరంగా వున్న గమ్యం నాకు దగ్గిరగా వస్తుందే అని,

ఇప్పుడర్ధమైందా?
మన  వెనుక వస్తున్న వాళ్లందరికీ దూరంగా ఈ  పరుగు
అయిన వాళ్ళనూ, తోటి వాళ్ళనూ దాటి వేయాలని మన ఉరుకు
కానీ,
నిన్ను దాటాలని పరిగెత్తడం లేదు అందరూ
నీ కోసమే పరిగెత్తేవాళ్లు వీళ్ళు అందరూ!

No comments:

Post a Comment