Wednesday, November 28, 2012

పువ్వుల లోనే జ్వాలలు రేగే

               పువ్వుల లోనే జ్వాలలు రేగే

అమెరికా వచ్చిన 16 సంవత్సరాలలో చాలా సంఘటనలు జరిగాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. కొన్ని సంఘటనలు గుర్తుండేవి, కొన్ని గుర్తుంచుకోవాలి అనిపించేవి. ఈ మధ్య జరిగిన ఒక పార్టీ, దాని గురించి ఏదైనా ఒక కొత్త పని చేసి అది చాలా రోజులుగా గుర్తుకు ఉండేటట్లు చెయ్యాలని అనిపించిన సంఘటన. ఎలా అంటే మొదటి డిస్నీలాండ్ ట్రిప్ కి గుర్తు గా మిక్కీ సోవెనీర్ ని ఇంట్లో పెట్టుకున్నట్టు గా.

అది మొన్న జరిగిన దీపావళి పార్టీ. స్టైల్ గా చెప్పాలంటే దీవాలీ పార్టీ. నాకు ఆ పార్టీ ఎంతగా నచ్చిందంటే, దాని గురించి  ఒక కథ వ్రాసి ఇలా అందరితో పంచుకొని ఒక సోవెనీర్ లాగా గుర్తుకు పెట్టు కుందామని అనిపించేంతగా! so ఇప్పటికి మీకు అర్థమయ్యి వుండాలి. ఇది నా మొదటి దిద్దు అని.

ఇంత పెద్ద విషయానికి మొదలు మాత్రం చాలా సింపుల్ గానే జరిగింది. ఒక రోజు మా ఇంట్లో పార్టీ అయిన తర్వాత బయల్దేరేముందు శశాంక్ & మధు వాళ్ళు "వెళ్ళొస్తా, మళ్ళీ మా ఇంట్లో దీవాళీ కి కలుద్దాం" అని చెప్పి వెళ్లి పోయారు. మా సునీత అది క్యాలెండర్ లో పెట్టేసింది ఆ క్షణమే. అప్పటినుంచే చూచాయగా గుర్తుకు వస్తూ వేరే పార్టీలు ఏమీ పెట్టుకోలేదు. కానీ ఆరోజు సరిగ్గా సాయంత్రం అవుతుండగా మా ఆవిడ  చిన్న మెలిక పెట్టింది. మన పక్కింటి వాళ్ళ పాపది 10th బర్త్ డే అండీ, మనల్ని పిలిచారు కానీ మనకు కుదరదు. వేరే పార్టీ వుంది అని చెప్పాను అంది. నాకు అప్పటికి ఏమీ అనుమానం రాలేదు. ఒక అరగంట తర్వాత ఏమండీ, పిల్లలు birthday కి వెళ్ళాలి అంటున్నారు. మనం దివాళీ పార్టీ కి కొంచం లేట్ గా వెళ్దాం అని చెప్పింది. అప్పటికి నాకు కన్ఫర్మ్ అయ్యింది. నాకు తెలియ కుండానే నా క్యాలెండర్ లో ఈ ఈవెంట్ ని కూడా పెట్టేసింది అని. అలాంటి వాటిల్లో మా ఆవిడ దిట్ట. నాకు అర్థం అయ్యేలోపులోనే తనకి కావలిసినవి జరిపించేసు కుంటుంది. ఏది అయితేనేం పిల్లల కోసం బర్త్ డే పార్టీ లో కేకు కట్ చేసిందాకా ఆగి, అప్పటికే స్టార్ట్ చేసి రెడీ గా వున్నా కారు లో అందరం పార్టీ కి బయల్దేరాం. కారు ఎక్కగానే ఏమండీ మీరు కేకు తినరు కదా, స్వీట్స్ బలేగా మానేసారు మీరు అని పొగిడింది. కొద్ది సేపటికి గాని నాకు అర్థం అవ్వలేదు. ఆ పొగడ్తలలో పడి నేను తనని లేట్ చేసావని కోప పడటం మర్చి పోయేలా చేసింది తను. అదీ మా ఆవిడ టాలెంట్.

అలా మాటల్లో పడి శశాంక్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. చాలా కార్లు వుండటం వాళ్ళ కొంచం దూరంగా పార్క్ చేయాల్సి వచ్చింది. కారు దిగగానే ఎదో ఒక కొత్త వాసన వచ్చింది. అది నేను చాలా కాలం క్రితం పీల్చిన వాసన  అవడం వాళ్ళ నాకు వెంటనే గుర్తుకు రాలేదు. శశాంక్ ముందే చెప్పడంతో, నడుస్తూ వాళ్ళ బ్యాక్ యార్డ్ లో కి వెళ్తుంటే, దగ్గరవుతున్న కొద్దీ ఆ వాసన ఇంకా ఎక్కువ అయ్యింది. మనసు చాలా ఫాస్ట్ గా గతం లోకి వెళ్లి  సమాధానం తెచ్చింది. అదీ వాసన. అదే దీపావళి వాసన. మొదట కొంచం పొగగా ఘాటు గా వుంటుంది. కానీ  వెంటనే మనకెంతో ఇష్టమైన దీపావళి పండుగ వాసన అయిపోతుంది. ఒక్కసారి గుండెల నిండుగా ఆ వాసన పీల్చాను. మనసు చాలా కొత్తగా వుందే ఇది అని ఒక వేపు, ఒరేయ్ ఇది మనకు చాలా పాతది రా, నిద్దుర లే, గుర్తు తెచ్చుకో అని ఇంకో వేపు పోట్లాడుతుంది. కానీ కళ్ళ ముందు పేలుతున్న దీపావళి మెరుపులు మనసును ఆలోచించకుండా, ముందు ఇక్కడ ఎంజాయ్ చెయ్యి బాసూ అని డిసైడ్ చేసాయి. అక్కడ చూస్తే వాళ్ళ బ్యాక్ యార్డ్ లో garage ముందు, పక్కన అంతా concrete చేసి వుంది. మంచిగా bright లైట్స్ పెట్టారు. కాంక్రీట్ చుట్టూ మనిషి ఎత్తులో కాగడాలు వున్న పొడుగు కర్రలు పాతారు. మధ్యలో చిన్న నీళ్ళ తొట్లు పెట్టారు. గరాజి లో ఒక టేబుల్ నిండా అన్ని రకాల దీపావళి సామాన్లు పెట్టారు. అక్కడ ఉన్న  ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు అందరూ రక రకాల కాకర పువ్వులు భూ చక్రాలు, చిచుబుడ్లు కాలుస్తున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని వెళ్లి ఆ కాగడాల కు అంటించుకొని వెలిగించి కాలుస్తూ వున్నారు. అందరు వాళ్ళ ధైర్యాన్ని బట్టి కాకర పువ్వుల నుంచి బాంబు ల వరకు ట్రై చేసారు. కాల్చిన పుల్లల్ని, కాలిన భూ చక్రాల్నీ తీసుకెళ్ళి నీళ్ళ తొట్టి లో dispose చేస్తున్నారు సేఫ్ గా. అదొక పెద్ద సంత లాగా దీపావళి టపాసుల గ్రాండ్ బఫే లాగా అనిపించింది. ఇలా ఒక 30 మంది కుటుంబాల వాళ్ళ పిల్లలు, పెద్దలు ఒక గంటన్నర పైగా కాల్చారు దీపావళి సామాను. అందులో ఒక రెండు రకాల కాకర పువ్వు వత్తులు, సీమ టపాకాయలు, చిన్న బాంబులు, పెద్ద బాంబులు, పైకి ఎగిరే బాంబులు, చిచ్చు బుడ్లు, భూచక్రాలు, జెయింట్ వీల్ లు, చైనా లాంటేర్న్ బాంబులు, స్ట్రోబ్ లైట్ బాంబులు, ఉల్లిపాయ బాంబులు, స్నేక్ లాగా పైకి వచ్చే నల్ల బిళ్ళలు, ఇంకా కొన్ని నాకు తెలియనివి వున్నాయి. అందరూ చిన్న కాకర పువ్వుల తో మొదలుపెట్టి కొంచం కొంచం పెద్దవి వెలిగించి చివరికి బాంబులతో గ్రాడ్యువేట్ అయ్యారు. మా పాప మొదట వాళ్ళ అమ్మ చీర వెనుకనుంచి భయంగా నక్కొని చూసింది. తర్వాత చిన్నగా నేను ఎత్తుకొని ఒక కాకర పువ్వు తో మొదలు పెడితే కొంచం సేపటికి బాంబులు కాలుస్తానంటూ రెడీ అయ్యింది. నా కన్నా ధైర్యంగా తను భూచక్రాల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అనిపించింది నాకు - మనకు తెలియకుండానే ప్రతీ పండుగా మనం పెద్ద వాళ్ళం అవడానికి ఉపయోగ పడుతుందేమోనని. మా పిల్లలలకు భయం లేకుండా చేసింది ఆ రోజు పండుగ.

ఇలా అందరూ కాలుస్తుంటే, ఫోటోలు తీయమని ఒక స్నేహితుడికి పురమాయించాడు శశాంక్. ఆటను ఆగకుండా అందరిని ఫోటోలు తీస్తూనే వున్నాడు. అక్కడకు వచ్చిన అమ్మాయిలు అందరూ మంచిగా చీరలలో తయారు అయ్యి వచ్చారు. వాళ్ళకి ఆ గుర్తు కోసం ఆగి మరీ ఫోటోలు దిగితున్నారు. క్రిష్ణ, ఉపేందర్ కలిసి ఒక ఫాషన్ షో లాగ అరేంజ్ చేసారు. అమ్మాయిల్ని అందరిని నిలుచోపెట్టి వెనుక బ్యాక్ డ్రాప్ లో చిచ్చుబుడ్ల మెరుపులతో ఫోటోలు తీసారు. అందరి అందమైన చీరలతో అక్కడ ఒక మనీష్ మల్హోత్రా ఫాషన్ షో లాగ అనిపించింది. ఇలా ఒక గంట పైనే జరిగాక నాకు ఆశ్చర్యంమేసింది. అమెరికాలో అదీ ఒక బిజీ కమ్యూనిటీ లో ఇలా బాంబులు కాల్చడానికి ఎలా వీలయ్యింది? శశాంక్ ఇది ఎలా చేయ్యగాలిగాడు అని? పక్కన వున్న ఫ్రెండ్ ని అడిగితే చెప్పాడు - శశాంక్ ఈ పార్టీ గురించి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ అందరి దగ్గిరా డిస్కస్ చేసి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాడు అని.నాకే నిజం గా వావ్ అనిపించింది. తను ఎంత ప్రయత్నించి ఉంటాడో తనకే తెలియాలి.

ఈ సందర్బంలో శశాంక్ & మధు గురించి చెప్పాలి. శశాంక్ నీ, మధు నీ చుస్తే వెంటనే అందరికి గుర్తుకు వచ్చేది వాళ్ళ ప్రశాంతత. ఇద్దరూ ఎప్పుడూ ఫ్రెండ్లీ గా నవ్వుతూ వుంటారు. నాకు శశాంక్ కొన్ని సంవత్సరాలగానే పరిచయం. అయినా చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు. తనను ఎప్పుడూ కోపంగా, చిరాకు గా చూడలేదు. చివరికి తనకి ఎంతో ఇష్టమైన wide receiver trade ని రిజెక్ట్ చేసినప్పుడు కూడా నవ్వుతూనే ఒప్పుకున్నాడు. శశాంక్ గురించి ఇంకా కొన్ని మంచి విషయాలు వున్నాయి కానీ - నేను ఇది వ్రాస్తున్న టైం కి నా fantasy football టీం కవల్లియర్స్ మీద తన టీం జగదేకవీరులు గెలుస్తున్నారు. అందుకే అవి దాచేసా! ఇక మధు లో చాల స్ట్రైకింగ్ ఫీచర్ నవ్వు. తను కళ్ళతో కూడా నవ్వగలదు. ఎప్పుడూ చాలా నిండుగా నవ్వుతూ పలకరిస్తూ వుంటుంది. ఆ నవ్వునీ, అందాన్నీ అలానే కంటిన్యూ చెయ్యమని కాబోలు, దేవుడు తనకు  ఇద్దరు కూతుళ్ళని ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఇంత పెద్ద పార్టీని చాలా చక్కగా అరేంజ్ చేశారు. అందరూ కాల్చిన  తర్వాత అందరికీ డిన్నర్ కూడా దీపావళి సంప్రదాయం తో చాలా స్వీట్లు, ఒక రకం గా చెప్పాలంటే మొత్తం బ్రేక్ ఫాస్ట్ టేబుల్ నిండా రక రకాలు స్వీట్లు పరిచారు. ఒక వేపు ఇలా దేశీయ సంప్రదాయం జరుగుతుంటే, కొంతమంది ఎవరో విదేశీ ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకొని వాళ్లతో ఎంజాయ్ చేశారు. వాళ్ళ పేర్లు గ్లెన్ ఫిడిక్, మెక్ కాలన్, హై నేకెన్. ఇంకొక వేపు స్థానిక తెలుగు రాజకీయాల ఫై వాడి వేడి చర్చ్చ జరిగింది. ప్రస్తుత తానా, నాటా సభల గురించి, ట్యాన్ టెక్స్ ఎన్నికల గురించీ చాలా మంది తమ అభిప్రాయాలని నిష్కర్షగా చెప్పలేక కొంత పాలిష్డ్ గానే చెప్పారని అనిపించింది. ఇవన్నీ నడుస్తూంటే అసలైన విషయం ఆగుతుందా? పోకర్ సెట్ ఓపెన్ అవ్వనే అయ్యింది.  వెంటనే 8 మంది తయ్యారు.. Blind లు, Double Blind లు... వెరసి కొంత చేతి దూల నేను కూడా తీర్చుకున్నా. ఎప్పడి లాగానే ఉపేందర్ ప్రాఫిట్.

ఇంతలోనే గొల్లున నవ్వులు. పెద్దగా surprise అని అరుపులు. సంగీత అందర్నీ పిలుస్తుంది. ఈరోజు రమణ, అంజలి వాళ్ళ 12th anniversary  అంట రండి రండి అని. అలా వాళ్ళు కేకు కట్ చేశారో లేదో, వాళ్ళని అమెరికా జంట లాగా ఒకసారి ముద్దు పెట్టుకోమని అందరి ఆకతాయి బలవంతం. సురేష్, క్రిష్ణ కలిసి వాల్లిద్దర్నీఎంత దగ్గిరకు నెట్టినా కానీ, వాళ్లిద్దరి ముఖాల్నీ  అడుగు దూరం కంటే దగ్గిరకు జరపలేక పోయారు. బయట అంతగా మాట్లాడే రమణ కూడా ఇబ్బందిగా మొఖం పెట్టి బిగుసుకుపోయాడు. ఇక అంజలి సంగతి సరేసరి. No Way అన్నారు ఇద్దరూ. ఈ లోపులో శశాంక్ పెద్దగా "ఏమోయ్ మధూ, వీళ్ళిద్దరూ సిగ్గుపడుతున్నట్లున్నారు. అమెరికన్ ముద్దు ఎలా పెట్టుకొవాలో ఒకసారి మనం చూపిద్దాం రా" అంటూ తన మనసులోని చిలిపి కోరికను బయట పెట్టాడు. మధు పెద్దగా నవ్వింది. అందరూ ముసి ముసి గా నవ్వుదామని ప్రయత్నించినా వీలు కాక పెద్దగానే గొల్లున నవ్వారు. ఆ నవ్వులతో, దీపావళి టపాసుల తో, స్వీట్లతో, మంచి ఆతిధ్యం తో ఎప్పుడో నా చిన్నప్పుడు జరుపుకున్న దీపావళి ని గుర్తుకు తెచ్చింది. అప్పటికే అర్దరాత్రి కావడం తో అందరికీ థాంక్స్ చెప్పి ఇంటికి  బయల్దేరాము. కారు వాళ్ళ కమ్యూనిటీ లో నుంచి బయటకు రాగానే సునీత అడిగింది. "ఏమండీ, ఇవ్వాళ potluck లో మీరు పొటాటో కర్రీ తిన్నారా? అది నేనే చేశాను. టేస్ట్ బాగుందా?" అని. నిజం చెప్పాలంటే అంత పెద్ద పార్టీలో, అన్ని వంటకాల్లో, తన పొటాటో కర్రీ ఎక్కడ వుందో, నేను తిన్నానో లేదో, నాకు గుర్తుకు రాలేదు. నా బలహీనత కొద్దీ నేను నిజం చెప్పేసాను. నాకు గుర్తుకు లేదని. దానికి మా ఆవిడ కళ్ళల్లో కోపం. ఈ Flower Mound పువ్వుల లో దీపావళి జ్వాలలు, నీ పువ్వుల్లాంటి కళ్ళల్లో కోపపు జ్వాలలు రెండూ అందంగానే వుంటాయి సుమా  అని సర్ది చెప్పుకొని, పార్టీ జ్ఞాపకాలని నేమరవేసుకుంటూ, నిశ్హబ్దం గా Plano కి డ్రైవ్ చేయడం మొదలు పెట్టాను.