Wednesday, July 3, 2013

నీ చేతి వంట

నీ చేతి వంట, మాడినా నేను తింటా
ఎందుకలా చూస్తావంటా, తినకపోతేనే తంటా
ఈ రోజు వంట చేసింది నీవు కాదనుకుంటా
మరు రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా 

మాడుచక్కలు తింటే మహారాజులు అవుతారంట
అని నీకు చిన్నప్పుడు ఎవరో చెప్పారంటా
అది అవసర సత్యమే కాని అక్షర సత్యం కాదంటా
నన్ను మాడు చక్కలతో మహారాజును చేయ్యోద్దంటా

వరుసగా రెండు రోజులు మాడ్చావు వంట
అందుకే ఈ కడుపు మంట
అందరికీ చెప్పానని ఏమీ అనుకోవంటా
అందుకని ముందే క్షమించమంటా

మరలా వండనా అని అడిగావు ఓరకంట
ఆ చూపుకు అర్థం మాకూ తెలుసునంట
అది రాబోవు ప్రళయ గర్జనలకు మచ్చు తునకంట
అందుకే తింటాను మారు మాట్లాడకుండా.