Wednesday, July 3, 2013

నీ చేతి వంట

నీ చేతి వంట, మాడినా నేను తింటా
ఎందుకలా చూస్తావంటా, తినకపోతేనే తంటా
ఈ రోజు వంట చేసింది నీవు కాదనుకుంటా
మరు రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా 

మాడుచక్కలు తింటే మహారాజులు అవుతారంట
అని నీకు చిన్నప్పుడు ఎవరో చెప్పారంటా
అది అవసర సత్యమే కాని అక్షర సత్యం కాదంటా
నన్ను మాడు చక్కలతో మహారాజును చేయ్యోద్దంటా

వరుసగా రెండు రోజులు మాడ్చావు వంట
అందుకే ఈ కడుపు మంట
అందరికీ చెప్పానని ఏమీ అనుకోవంటా
అందుకని ముందే క్షమించమంటా

మరలా వండనా అని అడిగావు ఓరకంట
ఆ చూపుకు అర్థం మాకూ తెలుసునంట
అది రాబోవు ప్రళయ గర్జనలకు మచ్చు తునకంట
అందుకే తింటాను మారు మాట్లాడకుండా.

Monday, May 13, 2013

అమ్మ- ప్రపంచం.

ఇంట్లో నాన్నని కొపపడే అమ్మకి అయినా
                నేనంటే మాత్రం విపరీతమయిన ప్రెమ.

ప్రపంచంలో ఎవరితో అసంతృప్తిగా వున్నా
నన్ను మాత్రం తృప్తిగా గుండెలకు హత్తుకుంటుంది.

తను పండుగలు అంటూ ఏమీ నమ్మదు.
             నేను నవ్వితే మాత్రం తనకి రోజూ పండుగే.

అమ్మకి ప్రపంచం వేరు నేను వేరు. 
నేనే అమ్మ ప్రపంచం

అందుకే నాకు అమ్మ వేరు. ప్రపంచం వేరు.

కానీ ఆ అమ్మ ఈ ప్రపంచానికే వేరు.
ఆ వేరు నుంచే కదా ఈ నా ప్రపంచం అంతా పుట్టింది, పెరిగింది.

అలా అని అమ్మకి దిష్టి పెట్టకండే.

Happy Mothers day!





Wednesday, February 13, 2013

Back to Basics - and I love it.


My new gadget. Nokia 100. A basic phone with color/Radio/music/games/flash light etc. Boots in 5 seconds. Literally can make a call within 5 seconds once powered on. Charged on Monday and still it is going on with 20% charge. I love it.

After using all these smart phones for last 10 years Blackberry,IPhone, Samsung Galaxy, Droids etc.. I am loving going back to basics.

All this is for $20.00.

Enjoying my new gadget at Hilton Chennai. Its beautiful to go back to basics once in a while. Very nostalgic.