అయ్యవార్లూ, మీకు హృదయ పూర్వక వందనాలు
మీ విద్య, నిబద్ధత తో గెలిచారు అందరి మనసులూ
ఆవిష్కరించారు సీతారామ కల్యాణ ఘట్టం కన్నుల పండుగగా
జరిపించారు బాబా దేవాలయ బ్రహ్మోత్సవం దిగ్విజయంగా
మీ మంత్రం, గాత్రం, భజనలు, సేవలు మాకు వీనుల విందు
గరుడ ధ్వజారోహణ నింపింది భక్తి పారవశ్యం అందరి నందు
మీ సమిష్టి కృషి వుంది చూడ ముచ్చట గా
ఉండాలి మీరు ఇలానే బాబా ఆశీస్సులతో కల కాలంగా
ఎన్నేన్నో అభినందనలు. మరెన్నో మంచి పూజా కార్యక్రమాలకై ఎదురు చూపులు.
సాయిరాం.
🙏 Plano షిర్డీ సాయి దేవాలయ అర్చకులకు అక్షర నమస్కారాలు...
No comments:
Post a Comment